- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇదెక్కడి కథ.. మగాళ్లకూ పీరియడ్స్ వస్తున్నాయి.. జాగ్రత్త పడండి..

దిశ, ఫీచర్స్ : ఆడపిల్లలకు ప్రతి నెల పీరియడ్స్ రావడం సహజం. ఈ సమయంలో వారిలో చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కడుపు నొప్పితోపాటు చాలా ఇబ్బందులు పడుతుంటారు. చూసే వాళ్లకు కూడా అయ్యో పాపం అనిపిస్తుంది. అలాగే అబ్బాయిల్లో కూడా పీరియడ్స్ వస్తాయి. అంటే ఇది బ్లీడింగ్, పునరుత్పత్తికి సంబంధించింది కాకుండా మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇరిటేషన్, నీరసం, ఏకాగ్రతలేకపోవడం, బలహీనంగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనినే మెడికల్ టెర్మినాలజీలో ఇరిటెబుల్ మేల్ సిండ్రోమ్ అని పిలుస్తుండగా.. సాధారణ భాషలో మగాళ్లకు పీరియడ్స్‌గా వర్ణిస్తారు. ఈ మధ్య వచ్చిన ‘సేవ్ ది టైగర్’ సిరీస్‌లో ఈ టాపిక్ డిస్కస్ కూడా చేశారు. అయితే ఇందుకు కారణాలు ఏంటి? ఎలా బయటపడాలి? తెలుసుకుందాం.
పురుషుల శరీరంలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ చాలా అవయవాలను నడిపిస్తుంది. ఇది ఎక్కువైనా తక్కువైనా సమస్యే. అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలసట, చిరాకు, కోపం వచ్చేస్తుంది. విపరీతమైన పని ఒత్తిడి, సరైన నిద్రలేకపోవడం, మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లే ఇందుకు కారణం. కాగా టెస్టోస్టిరాన్ బ్యాలెన్స్ కోసం పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. డెయిలీ వర్క్ అవుట్ లేదా వాకింగ్ చేస్తూ.. హెల్తీ డైట్ ఫాలో అయిపోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మందు, సిగరెట్‌ను వీలైనంత అవాయిడ్ చేస్తూ.. కంటినిండ నిద్రపోవాలి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. ఇలా చేస్తే ఈ ఇరిటెబుల్ మేల్ సిండ్రోమ్ నుంచి బయటపడొచ్చని వివరించారు.