- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ, వెబ్‌డెస్క్ : సన్నగా కనిపించాలని ఎవరికి ఉండదూ, చాలా మంది సన్నగా, నాజుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తారు. అందుకోసం వారు తమ డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ ఫుడ్ తినాలి, ఏఫుడ్ తీసుకోవడం వలన త్వరగా సన్నగా అవుతాం అని ఆలోచిస్తూ ఫుడ్ తీసుకుంటారు. ఇందులో భాగంగా రాత్రి పూట అన్నానికి బదులు చపాతిని తింటారు చాలామంది. ఇక మరికొంత మంది కొంచెం అన్నం, ఓ చపాతి రెండూ కలిపి తింటారు. అయితే ఇలా అన్నం చపాతి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణు అంటున్నారు. ఇలా చపాతి, అన్నం తినడం వలన కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రాత్రి పూట అన్నం, చపాతి తినడం వలన జీర్ణ సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. రాత్రిపూట జీర్ణక్రియ సాధరణంగానే నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా ఇలా తినడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు, పొట్టకూడా పెరుగుతుందని, దీని వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మధ్యాహ్నం లేదా రాత్రి మాత్రమే అన్నం తినాలి. చపాతీ తినాలంటే కేవలం చపాతీ మాత్రమే తినండి. రెండింటిని అస్సలు కలిపి తినకూడదు. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. అలాగే బరువు తగ్గాలన్నా , చపాతినే తినాలి తప్ప రెండు కలిపి తిన కూడదని వైద్య నిపుణుల తెలుపుతున్నారు.