- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వేగంగా భోజనం చేస్తున్నారా.. అయితే మీ కోసమే!
దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో చాలా మంది అన్ని పనులు త్వరగా ముగించాలని భోజనం కూడా వేగంగా తింటుంటారు. ఇలా స్పీడ్‌గా ఫుడ్ తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇలా చేయడంలో అనేక సమస్యలు వస్తాయి. ఇప్పుడు అవెంటో తెలుసుకుందాం.
ఏ ఆహారం తీసుకున్నా నెమ్మదిగా తినాలి, బాగా నమిలి తినాలి. సరిగ్గా నమలకుండా ఆహారం తీసుకుంటే జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో క్రమంగా జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా దెబ్బతింటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వేగంగా తినడం ద్వారా అసిడిటీ సమస్యలు, పేగుల సమస్యలు వస్తాయని తెలుపుతున్నారు.
వేగంగా భోజనం చేయడం ద్వారా ఇన్సులిన్ నిరోధకత పెరిగి డయాబెటిస్ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఎక్కిళ్లు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు. ఇక వేగంగా భోజనం చేసే సమయంలో ఎంత ఆహారం తీసుకుంటున్నామనేది తెలియదని.. దీంతో ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. దీంతో బరువు పెరుగుతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.