హెల్త్ మినిస్ట్రీలో కరోనా.. రెండు రోజులు బంద్

by vinod kumar |
హెల్త్ మినిస్ట్రీలో కరోనా.. రెండు రోజులు బంద్
X

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య శాఖ తమ అధికారులు, సిబ్బంది కోసం కొన్ని ముందస్తు జాగ్రత్తల జాబితాను రూపొందించి విడుదల చేసింది. వాటిని తప్పకుండా పాటించాలని ఆదేశించింది. నిర్మాణ్ భవన్‌లోని ఈ శాఖ కార్యాలయన్నింటిని రెండు రోజులు(6వ తేదీ, 7వ తేదీ) మూసివేస్తున్నట్టు తెలిపింది. ఈ రెండు రోజులు కేవలం ఎమర్జెన్సీ కొవిడ్ 19 బృందాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, అవి కార్యాలయాలు, ప్రాంగణాలు, వాష్‌రూమ్‌లు సహా అన్నింటిని శానిటైజ్ చేస్తాయని వివరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ డాక్టర్ హర్షవర్దన్, సెక్రెటరీ ప్రీతి సుదన్, సంయుక్త కార్యదర్శులుసహా జూనియర్ స్టాఫ్ అందరూ ఈ మార్గదర్శకాలు పాటించాలని ఆ ఆఫీస్ మెమోరాండం తెలిపింది. సిబ్బంది, అధికారులు ఒక్కోసారి సామాజిక దూరాన్ని పాటించట్లేదని తెలిసిందని పేర్కొన్న ఈ ఆఫీస్ మెమోరాండం మూడో తేదీతో విడుదలైంది. అధికారులు వేర్వేరు రోజుల్లో ఆఫీసుకు వచ్చే వెసులుబాటును ఆలోచించాలని, కలిసి భోజనాలను ప్రోత్సహించరాదని, సమావేశాలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పేర్కొంది. ఆఫీసుల్లోనూ సిబ్బంది మాస్కులు కచ్చితంగా ధరించాలని, ఆఫీసు ప్రాంగణంలో ఉమ్మివేయరాదని ఆదేశించింది. దేశంలో కరోనా కేసులు రెండు లక్షలను దాటిపోయాయి. ఈ కరోనా మహమ్మారిని పర్యవేక్షించి, కట్టడి వ్యూహాలను ఈ శాఖనే తీసుకుంటున్నది. అటువంటిది హెల్త్ మినిస్ట్రీలోనే కేసులు వెల్లడవడంపై ఆందోళనలు వెలువడుతున్నాయి.

కేంద్ర కార్మిక శాఖలో కూడా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో అధికారుల అప్రమత్తం అయ్యారు. రెండు రోజులు పాటు శానిటైజ్ చేసేందుకు కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ రెండు రోజులు సిబ్బంది వర్క్ ఫ్రం హోం చేయాలని ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed