- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాకు మనుషులను చంపే శక్తి లేదు : ఈటల
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై గురువారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ప్రపంచంలో కరోనా కంటే భయంకరమైన వ్యాధులు ఎన్నో వచ్చాయని, అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదని తెలిపారు.
కరోనా మహమ్మారికి మనుషులను చంపే శక్తి లేదన్నారు. యూపీహెచ్‌సీ, బస్తీ దవాఖానలోనూ కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. వారం నుంచి రాష్ట్రంలో రోజుకు 50 నుంచి 60 వేల టెస్టులు చేస్తున్నామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కరోనాతో మరణిస్తున్న వారితో పోల్చితే.. తెలంగాణలో తక్కువగానే చనిపోతున్నారన్నారు. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన బాగానే పెరిగిందన్నారు. అంతేకాక రాబోయే రోజుల్లో కరోనాతో జీవించాలని మంత్రి ఈటల తెలిపారు.