త్వరలో ఆరోగ్య బీమా రంగంలో రెండంకెల వృద్ధి

by Harish |
త్వరలో ఆరోగ్య బీమా రంగంలో రెండంకెల వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: గత ఐదేండ్లుగా బలమైన వృద్ధిని సాధిస్తున్న ఆరోగ్య బీమా విభాగం… రానున్న రోజుల్లో ఇదే ధోరణితో రెండంకెల వృద్ధిని సాధిస్తుందని ఓ నివేదిక తెలిపింది. 2015-2020 మధ్య కాలంలో ఈ విభాగం 20 శాతం వార్షిక వృద్ధి రేటుని కలిగి ఉందని ఇండియా రేటింగ్స్ పరిశోధన నివేదిక తెలిపింది. ప్రైవేట్ పెట్టుబడిదారులు ప్రభుత్వ బీమా రంగంలో మార్కెట్ వాటాను పెంచుకునే ప్రతిపాదన బడ్జెట్‌లో రావడంతో మరింత వేగంగా ఆరోగ్య బీమా విభాగం పెరుగుతుందని నివేదికలో పేర్కొంది.

అదేవిధంగా ప్రీమియం ధరల పెరుగుదల కారణంగా ఈ రంగం అధికంగా డబుల్ డిజిట్ వృద్ధిని సాధిస్తుందని ఆశిస్తున్నట్టు రేటింగ్ సంస్థ పేర్కొంది. ప్రీమియం ధరలపై ఒత్తిడి ఉండవచ్చని, అలాగే, కరోనా వ్యాప్తి బీమా సంస్థల్లో క్లెయిమ్‌ల తీవ్రత పెరిగేందుకు దారి తీసిందని నివేదిక అభిప్రాయపడింది. కరోనా లాంటి మహమ్మారి కారణంగా ప్రజలు ప్రీమియం భారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. పాలసీదారుల నిర్వహణ ఖర్చులను నియంతించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని, ఇది మొత్తం ఖర్చులో ఎక్కువ భాగాన్ని కలిగి ఉంటుందని నివేదిక తెలిపింది.

Advertisement

Next Story