- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్ న్యూస్.. తెలంగాణలో కరోనా వ్యాప్తిపై హెల్త్ డైరెక్టర్ కీలక ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా వైరస్వ్యాప్తిరేటుఒక్క శాతానికి తగ్గిందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెథమెటికల్ సైన్సెస్ సంస్థ పేర్కొన్నది. అయితే, తెలంగాణలోనూ కేవలం 0.95 శాతం మాత్రమే వ్యాప్తిరేటు ఉన్నదని హెల్త్డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ప్రకటించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే కరోనా కంట్రోల్‌కి వచ్చిందన్నారు.
గత కొన్ని రోజుల నుంచి పండుగలు, ఫంక్షన్లు, పార్టీలు, రాజకీయ ప్రచారాలు విస్తృతంగా జరుగుతున్నా, కేసులు పెరగలేదని తేల్చి చెప్పారు. ఇది మంచి పరిణామమని వివరించారు. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత తగ్గుతుందన్నారు. ఇప్పటికే వ్యాక్సినేషన్‌ను వేగంగా నిర్వహిస్తున్నామని, దీంతోనే కొంత వరకు వ్యాప్తి తగ్గిందన్నారు. అంతేగాక కొత్త కేసులు కూడా తక్కువగా వస్తున్నాయన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ మొదటి, రెండో డోసులను ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు. అవగాహన కల్పించడం, డోసులు పంపిణీ కార్యక్రమాల్లో హెల్త్‌కేర్ వర్కర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. కానీ, వైరస్ పూర్తిగా కనమరుగయ్యే వరకు ప్రజలు సహకరించాలని కోరారు. కేసులు తగ్గినా, జాగ్రత్తలు తప్పనిసరి అని సూచించారు.
ఆర్‌నాట్ అంటే.?
వైరస్ వ్యాప్తి ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని ఆర్‌నాట్‌లో(రీ ప్రోడక్షన్నంబర్) లెక్కిస్తారు. ఆర్నాట్విలువ 1 ఉంటే వైరస్ వ్యాప్తి చాలా స్పీడ్‌గా ఉందని అర్థం. ప్రతీ 100 మంది మరో వంద మందికి వ్యాప్తి చేస్తున్నట్లు లెక్క. దీని ప్రకారం తెలంగాణలో 0.95 అంటే ప్రతీ వంద మంది కేవలం 95 మందికి మాత్రమే వ్యాప్తి చెస్తున్నారని అర్థం. అంటే చాలా నెమ్మదిగా వ్యాప్తి ఉందని డాక్టర్లు తెలిపారు.