పాలకూరతో ప్రయోజనాలు..!

by Anukaran |   ( Updated:2024-02-03 13:26:34.0  )
పాలకూరతో ప్రయోజనాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: మన శరీరానికి ప్రయోజనాలు కలిగించే ఆకుకూరల్లో పాలకూర ప్రత్యేకం. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. వారానికి ఒకసారి పాలకూర తింటే పలు రోగాలను నియంత్రించవచ్చు. దీనిలో ఉండే విటమిన్ ‘ఎ’ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇది కంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇక బరువు తగ్గాలి అనుకునేవారికి పాలకూర ఎంతో తోడ్పడుతుంది.

పాలకూరలో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో దీనిని ఆహరంగా తీసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. పాలకూర జ్యూస్‌ను రెగ్యూలర్‌గా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన విటమిన్ ‘కె’ లభిస్తుంది. పాలకూర వల్ల మలబద్ధకం దూరం అవుతుంది. మెదడు చురుగ్గా పనిచేసి మానసిక సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక గర్భిణీలకు పాలకూర జ్యూస్ ఎంతో మంచిది. డెలీవరి తర్వాత నాడీ మండల సమస్యలు రాకుండా ఉంటాయి.

పాలకూరలో ఉండే విటమిన్ ‘సి’, ‘ఎ’, మెగ్నిషీయం, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించడంలో తోడ్పడతాయి. అదేవిధంగా ఇది గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. పాలకూర నిద్రలేమి సమస్యలను దరిచేరకుండా చేస్తుంది. కండరాల సమస్య ఉన్నవారు పాలకూర ఆహారంగా తీసుకోవడం ద్వారా ఎంతో ఉపయోగపడుతుంది. దీని వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. అదేవిధంగా శరీరానికి ఆక్సిజన్ అందేలా చూస్తుంది. పాలకూరలో ఉండే ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

పాలక్ కిచిడీ రెసిపీ

Advertisement

Next Story

Most Viewed