- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాగుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ భారతదేశంలో రాగులు ఎక్కువగా వినియోగిస్తుంటారు. రాగుల్లో మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి. మిగతా చిరు ధాన్యాలతో పోలిస్తే రాగుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగులతో చేసిన పదార్థాలను ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఎంతో మేలు కలుగుతుంది. రాగి రొట్టె , జావా, సంకటి ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఆర్యోగానికి మంచిదే. ముఖ్యంగా ఎండాకాలంలో రాగి జావా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
రాగుల్లో విటమిన్ ఎ, బి, సి, ప్రొటీన్లు, ఖనిజాలు, అయోడిన్ సమృద్ధిగా ఉంటాయి. రాగుల్లో అమినో యాసిడ్స్, ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం కలిగి ఉంటాయి. దీంతో ఆకలిని తగ్గించడంతో పాటు బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాగి పిండితో తయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. దీంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
రాగుల్లో ఉండే పాలిఫినాల్స్, డైటరీ ఫైబర్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రాగులను తరచూ తీసుకుంటే పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులను దూరం ఉంచుతుంది. రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి.
రాగులను ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా కాలేయ వ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది. రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. అధిక రక్తపోటు నివారిణిగా రాగులు ఎంతో మేలు చేస్తాయి.