- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాలతో ఈ సమస్యలు దూరం…
దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్యానికి పాలు చేసే మేలు అంతో ఇంతో కాదు చాలానే ఉంది. వీటిలో అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి. చాలామంది పాలు వాసన కూడా పడదు అంటారు కానీ మంచి ఆరోగ్యానికి పాలు స్వీకరించటం ఎంతో శ్రేయస్కరం.
# పాలలో కాల్షియమ్ (calcium) , ఫాస్పరస్ (phosphorus), విటమిన్-D (vitamin-D) పుష్కలం.
# పాలను మన నిత్య ఆహారంలో చేర్చుకోవటం వలన గుండె జబ్బుల (heart diseases) కు దూరంగా ఉండవచ్చు.
# పాలలో కాల్షియమ్ అధికంగా ఉంటుంది. ఇది చెడు కొవ్వు (bad cholestrol) ను తగ్గించి మంచి కొవ్వును పెంచుతుంది. ఎముకలు కూడా దృఢంగా ఉంచుతుంది.
# గోరు వెచ్చని పాలలో పసుపు కలుపుకుని తాగితే జలుబు (cold), జ్వరం (fever) తగ్గుతాయి. ఈ పాలను తాగడం వలన శరీరంలోని వ్యర్ధాలు బయటకు పోతాయి. ఇలా తాగటం వలన తలనొప్పి (headache) కూడా తగ్గుతుంది. ఈ పాలు యాంటివైరల్ (anti viral) గా కూడా పని చేస్తాయి. పసుపు పాలను తాగటం వలన కండరాల నొప్పులు, కాళ్ళ వాపులు కూడా తగ్గుతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఆడవారికి నెలసరి సమయంలో వచ్చే నడుము నొప్పులు, కడుపు నొప్పి (menstrual pains) కూడా ఉండవు.
# కొవ్వు లేని పాలు సేవించటం వలన టైప్-2 మధుమేహం (type-2 diabetes) బారిన పడే అవకాశాలు తక్కువ.
# పాలలో ఉండే కాల్షియమ్, మెగ్నీషియం రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ (glucose levels in blood) ను ఆరురోగ్యకర స్థాయిలో ఉంచుతాయి.
# చర్మ సౌందర్యానికి (beautiful skin) పాలు ఎంతో ఉపయోగపడతాయి. అవి లోపలికి తీసుకున్నా, బాహ్య లేపనాలలో వాడినా వాటి ఫలితం ఉంటుంది.
# పాలు సహజ (క్లెన్సర్).. పాలలో దూది ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం పైన మురికి తొలగి ఆరోగ్యవంతంగా ఉంటుంది.
# పాలు, పసుపు కలిపి ముఖానికి లేపనం వేసిన ముఖం మంచి ఛాయను పొందుతుంది.
# రాత్రి పడుకునే ముందు పాలను తాగితే సుఖ నిద్ర పడుతుంది. నిద్రలేమి తగ్గుతుంది.
# పాలు పురీష నాళ, రొమ్ము కాన్సర్ (breast cancer) లను తగ్గించే సామర్ధ్యం కలిగి ఉంటుంది.
కొంచెం కష్టం అయినా ఇష్టం చేసుకుని పాలను రోజూ తాగుతుంటే ఆరోగ్యం మన సొంతం.