- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health tips: కొబ్బరి నీరు వల్ల కలిగే ప్రయోజనాలు
దిశ, వెబ్‌డెస్క్: మనకు ఒంట్లో నీరసంగా అనిపించినా.. జ్వరం(Fever) వచ్చినా కొబ్బరి(Coconut) నీళ్లు తాగుతాము. మన శరీరానికి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేకూరుస్తాయి. ఈ నీళ్లలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛంగా దొరికే కొబ్బరి నీళ్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
కొబ్బరి నీళ్లు తరచుగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మంచింది. వీటిలో ఉండే పౌష్టిక గుణాలు, మినరల్స్(Minerals) శరీరానికి మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్లలో మంగనీస్ అధికంగా ఉంటుంది. వీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో సులువుగా బరువు తగ్గుతారు. ఈ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కిడ్నిలోని చిన్న సైజ్ రాళ్లు కరిగిపోతాయి. అలాగే వీటిని తాగడం వల్ల హార్ట్ అటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కొబ్బరి నీళ్లు అధిక రక్తపోటును తగ్గిస్తుంది.
కొబ్బరి నీరులో మినరల్స్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఈ నీళ్లను తరచూగా తీసుకోవడం వల్ల డీ హైడ్రేషన్(Hydration) సమస్యను దూరం చేస్తుంది. కొబ్బరి నీరు పొటాషియం స్థాయిని పెంచడంతో కండరాల తిమ్మిర్ల సమస్యలు తగ్గుతాయి. వీటిలో ఉండే కాల్షియం(Calcium), మెగ్నిషీయం(Magnesium) ఎముకలను ధృఢంగా ఉండేలా చేస్తాయి. ఈ కొబ్బరి నీళ్లు రక్తం గడ్డకట్టే సమస్యను పరిష్కరిస్తాయి. కొబ్బరి నీళ్లు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళ్ల ద్వారా గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక నిద్రలేమితో బాధపడేవారు పడుకునే ముందు కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది.
కొబ్బరి నీళ్లు యాంటీ డయాబెటిక్(Anti-diabetic)గా పని చేస్తాయి. బ్లడ్ షుగర్(Blood sugar) ని తగ్గించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. డయాబెటిస్(Diabetes) బాధపడుతున్నవారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ నీళ్లు రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్స్‌ను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలోని ఔషధ గుణాలు శరీరంలోకి ప్రవేశించిన హానికరమైన బ్యాక్టీరియా(Bacteria)తో పోరాడగలవు. ఈ కోలి, పి ఎరుగినోస, బీ సబ్ టిల్స్ , ఆరియస్ వంటి బ్యాక్టీరియాపై కొబ్బరి నీళ్లు ప్రభావంతంగా పని చేస్తాయి.
అథ్లెట్లు(Athletes), వ్యాయామాలు(Exercises) చేసేవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. మీకు తక్షణ శక్తిని ఇవ్వడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. వీటిని తరచూగా తీసుకోవడం ద్వారా తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. కొబ్బరి నీళ్లను తరచూగా తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే ట్రాన్స్-జేజిటిన్ జ్ఞాపకశక్తిని పెంపొందించగలదు. మతిమరుపు సమస్యను కొంత మేరకు పరిష్కరించగలదని నిపుణులు తెలుపుతున్నారు.