బ్లాక్ టీ ఎందుకు తాగాలి ?

by sudharani |   ( Updated:2021-07-27 21:57:15.0  )
బ్లాక్ టీ ఎందుకు తాగాలి ?
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్లాక్ టీ గురించి చాలా మందికి తెలియదు. బ్లాక్ టీ తాగాలా ? తాగకుంటే ఏమవుతుందిలే అనుకుంటారు. కానీ బ్లాక్ టీ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కామెల్లియా సినెసిస్ అనే మొక్క ఆకుల పొడి ద్వారా తయారవుతుంది. అందువలన బ్లాక్ టీ రుచిగా ఉండడంతో పాటూ, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అన్నీ టీల కంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో, బ్లాక్ టీ కి బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు బ్లాక్ టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం.

  • బ్లాక్ టీలో ఉన్న ఎమైనో యాసిడ్, కార్టిసాల్ హార్మోన్ ఒత్తిడిని తగ్గిస్తుంది. నిత్యం బ్లాక్ టీ తాగడం వలన రోజంతా ఉత్సహంగా ఉంటారు. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దూరమవుతాయి.
  • ఆస్తమాకు బ్లాక్ టీ మంచి ఔషదంగా పనిచేస్తుంది. వేడివేడిగా ఉండే ద్రవాలను తాగటం వల్ల ఆస్తమా నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది. అయితే బ్లాక్ టీ శరీరంలోకి ఎక్కువ గాలిని పంపించి, సులభంగా ఊపిరి తీసుకునే వీలును కల్పిస్తుంది. అందువల్ల బ్లాక్ టీని తాగితే చాలా మంచిది.
  • రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ బ్లాక్ టీ ఉపయోగపడుతుంది.
  • మధుమేహం, గుండె జబ్బులు, పీసీఓడీ వంటి వాటికి మూలకారణం వెయిట్ లాస్. అయితే రోజుకు ఓ కప్పు బ్లాక్‌ టీ తాగితే బరువు తగ్గడం ఈజీ అవుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేసే బ్యాక్టీరియా పెరగడానికి బ్లాక్‌ టీ దోహదం చేస్తుంది.
  • డయేరియా వ్యాధి గ్రస్తులు బ్లాక్ టీ తాగితే వెంటనే ఉపశమనం పొందుతారు.

డబ్బు లేని జీవనం గడపాలని ఉందా..? ‘ఆరోవిల్’కు వెళ్లాల్సిందే!

Advertisement

Next Story