మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదా, కాదా ?

by Anukaran |   ( Updated:2021-07-29 23:57:24.0  )
మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదా, కాదా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : నిద్రపోవడం చాలా మందికి ఇష్టం. ఇక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఓ కునుకు తీస్తే బాగుండూ అనుకుంటారు చాలా మంది. అంతే కాకుండా మధ్యాహ్నం నిద్ర పోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. కానీ, మరికొంత మంది మాత్రం మధ్యాహ్నం నిద్రపోతే నైట్ నిద్ర రాదని ఏదో ఒక పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యాహ్నం నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదా, కాదా.. ఒక వేళ మధ్యాహ్నం నిద్ర మంచిదైతే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నిద్రపోవాలి.. మధ్యాహ్నం నిద్ర ప్రయోజనాలు తెలుసుకుందాం.

నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక మధ్యాహ్నం నిద్ర వలన ఎన్నో ఆరోగ్యసమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. మధ్యాహ్నం నిద్ర పోవడం వలన ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఈ నిద్ర వల్ల షుగర్, థైరాయిడ్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అంటున్నారు. ఈ నిద్ర ద్వారా హార్మోన్లు చురుగ్గా పనిచేసి తద్వారా జీర్ణక్రియ సాఫీగా ఉంటుందని, స్థూలకాయం లాంటి సమస్యలను సులువుగా అధిగమించవచ్చని తెలిపారు. అంతే కాకుండా మధ్యాహ్నం నిద్రవలన జీర్ణక్రియ మెరుగవుతుంది. హైబీపీని నియంత్రిస్తుంది. స్థూలకాయ సమస్య నుంచి బయటపడవచ్చు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు కూడా మధ్యాహ్నం నిద్ర ఉపయోగపడుతుంది.

చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. మధ్యాహ్నం ఏ సమయంలో నిద్రపోతే మంచిది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిద్రపోవాలని. అయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నిద్రించాలి. ఇలా నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణుల చెప్తున్నారు. అంతే కాకుండా చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు గరిష్టంగా 90 నిమిషాలపాటు నిద్ర శ్రేయస్కరం. ఆరోగ్యవంతులు, సాధారణ వ్యక్తులైతే 10 నుంచి గరిష్టంగా 30 నిమిషాలు కునుకు తీయడం ఆరోగ్యానికి మేలు.

Advertisement

Next Story

Most Viewed