- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటికెళ్లడానికి బస్సు దొంగతనం చేశాడు
దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు నెలలుగా లాక్‌డౌన్ అమలవుతోంది. నాలుగో లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రయాణాలకు కొన్ని సడలింపులు ఇచ్చారు. అంతే కాకుండా వందలు, వేల కిలోమిటర్లు నడుచుకుంటూ వెళ్లిపోతున్న వలస కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసి సొంతూళ్లకు పంపుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో చిక్కుకుపోయిన కర్ణాటక వ్యక్తి సొంతూరు వెళ్లేందుకు ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించిన ఘటన కలకలం రేపింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే… కర్ణాటకకు చెందిన ముజామిల్ ఖాన్ అనంతపురం జిల్లా ధర్మవరంలో చిక్కుకుపోయాడు. దీంతో బెంగళూరు వెళ్లిపోతే.. అక్కడ్నించి ఇంటికి చేరుకోవచ్చని భావించాడు. దీంతో అందర్లా ఆలోచించకుండా ఎపీఎస్ ఆర్టీసీ బస్సును దొంగిలిస్తే అంత సులభంగా గుర్తించరని భావించి అదును కోసం చూశాడు. ధర్మవరం డిపోకి చెందిన ఏపీ 02 జెడ్ 0552 బస్సును ఆపిన డ్రైవర్ భోజనానికి వెళ్లాడు. దీనిని అదునుగా తీసుకున్న ముజామిల్ ఖాన్ దొంగిలించాడు.
ముక్కూముఖం తెలియని వ్యక్తి డ్రైవర్ సీట్లో ఉండడం గుర్తించిన సెక్యూరిటీ కానిస్టేబుల్ సుష్మ వెంటనే విషయం పోలీసులకు తెలిపారు. దీంతో జియో ట్రాకింగ్ ద్వారా బస్సు మామిళ్లపల్లి రహదారి మీదుగా వెళ్తుందని గుర్తించి, చెన్నేకొత్తపల్లి ఎస్ఐకి సమాచారం అందించారు. దీంతో ఆయన కియా కంపెనీ దగ్గర రోడ్డుకు అడ్డంగా కంటైనర్ వాహనం నిలిపారు. దీంతో రొడ్డు దాటేందుకు మార్గం లేక, బస్సు నిలిపేసిని ముజామిల్ ఖాన్ పరారయ్యే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు అతడిని చాకచక్యంగా పట్టుకుని ధర్మవరం పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.