నాకు డ్రగ్స్ తీసుకోవడం నేర్పించింది అతనే..

by Jakkula Samataha |   ( Updated:2021-03-05 11:29:02.0  )
నాకు డ్రగ్స్ తీసుకోవడం నేర్పించింది అతనే..
X

దిశ, వెబ్ డెస్క్ : నటి పూర్ణ తాను నటించిన ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ నటుడు తనకు డ్రగ్స్‌ను ఎలా పీల్చాలో షూటింగ్లో నేర్పించాడని చెప్పింది. విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన పవర్ ప్లే సినిమాలో పూర్ణ మొదటిసారి నెగిటివ్‌ రోల్‌ చేస్తున్నది. పూర్ణ.. ఈ సినిమాలో డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిగా కనిపించనున్నారు.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియా సమావేశంలో నటి పూర్ణ మాట్లాడుతూ.. తాను ఈ సినిమాలో మొదటిసారి నెగిటివ్‌ రోల్‌ పోషిస్తున్నట్లు చెప్పింది. ఇందులో డ్రగ్‌ అడిక్ట్‌గా కనిపిస్తానని, ఇందుకోసం చాలా కష్టపడ్డానని తెలిపింది.

ఈ సినిమాలో ముక్కుతో డ్రగ్స్ను పీల్చే సన్నివేశాలు ఉంటాయని, అయితే డ్రగ్స్‌ ఎలా తీసుకుంటారో తెలియక ఒక్కోసారి ఆ పౌడర్‌ ముక్కులోకి వెళ్లిపోయేదని తెలిపింది. ఈ క్రమంలో సెట్‌లో ఉన్న ఓ నటుడు డ్రగ్‌ను ఎలా పీల్చాలో నేర్పించాడని నవ్వుతూ చెప్పింది. పవర్ ప్లే సినిమా ఈరోజు విడుదల అయ్యింది.

Advertisement

Next Story