వద్దంటే వెళ్లాడు.. మూసీలో చిక్కుకున్నాడు

by Shyam |   ( Updated:2021-08-31 07:15:18.0  )
musi
X

దిశ వికారాబాద్: మూసీ నదిలో కారు కొట్టుకుపోయిన సంఘటన వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం చించల్‌పేట్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భారీ వర్షాలు కురుస్తున్న ఓసి వాగు ఉప్పొంగుతూ ప్రవహిస్తుందని చెప్పిన వినకుండా వికారాబాద్ మండలం ధన్నారం గ్రామానికి చెందిన ప్రకాష్ తన కారుతో మూసి వాగు దాటే ప్రయత్నం చేసి వాగు మధ్యలో చిక్కుకొని సుమారు 100 మీటర్ల దూరం కొట్టుకొని పోయాడు. ఈ సంఘటనలో కారు నడుపుతున్న ప్రకాష్ ప్రాణాలతో బయటపడ్డాడని కారు మొత్తం డ్యామేజ్ అయినట్లు తెలిపారు. మూసి వాగులో చిక్కుకున్న కారుని చించల్‌పేట్ సర్పంచ్ శ్రీనివాస్, గ్రామస్థులు వాగులోకి దిగి తాడు, జేసీబీ సహాయంతో ఒడ్డుకు చేర్చారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణప్రాయం జరగలేదు.

Advertisement

Next Story