- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను.. గురుకులాల డైరెక్టర్‌గా నియమించాలి
దిశ, హైదరాబాద్: తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్‌ను రాష్ట్రంలోని అన్ని శాఖలకు చెందిన గురుకులాలకు డైరెక్టర్‌గా నియామకం చేయాలని స్వేరోస్ సెంట్రల్ జోన్ అధ్యక్షులు సునీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఐజీ నుంచి అదనపు డీజీపీగా పదోన్నతి వచ్చినందుకు ట్యాంక్‌బండ్ వద్దనున్న బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వేరోస్, టీజీపీఏ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళ్లర్పించారు. అనంతరం స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు. స్వేరోస్ సెంట్రల్ జోన్ అధ్యక్షులు రుద్రవరం సునీల్ మాట్లాడుతూ… ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పదోన్నతి కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఐజీ నుంచి అడిషనల్ డీజీపీగా హోదా పెరగడంతో రాష్ట్రంలోని అన్ని గురుకులాలకు డైరెక్టర్‌గా నియామకం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు జాన్ కుమార్, కార్యదర్శి నెమలి రవికుమార్, స్వేరోస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు భూషిపాక శంకర్, ఎర్ర భూపాల్, నందకుమార్, నాగరాజు, బొట్టు సాయి, సత్యనారాయణ, ప్రమోద్, దినకర్, శైలు తదితరులు పాల్గొన్నారు.