- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సరికొత్త రికార్డు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. బుధవారం నాటికి బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 8 లక్షల కోట్లను దాటింది. ఈ రికార్డుతో రూ. 8 లక్షల కోట్లను దాటిన భారత మూడో సంస్థగానే కాకుండా, బ్యాంకింగ్ రంగంలో మొదటి సంస్థగా నిలిచింది. ప్రస్తుతం దేశీయంగా అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 13.33 లక్షల కోట్లు, టీసీఎస్ రూ. 10.22 లక్షల కోట్లతో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
కొవిడ్-19 కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారతీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్ ధర రూ. 750 దిగువకు పతనమైంది. అనంతర పరిణామాల్లో నిలదొక్కుకున్న బ్యాంకు షేర్ బుధవారానికి రూ. 1,438 వద్ద ట్రేడయింది. భారీ పతనం నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో బ్యాంక్ షేర్ ధర ఏకంగా 98 శాతం ర్యాలీ చేసింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే, గతేడాది కంటే ప్రస్తుత్ ఏడాదికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్ సుమారు 14 శాతం లాభపడింది. ఇటీవల సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం కూడా 18 శాతం ఎగసి రూ. 7,513 కోట్లుగా నమోదు చేసిన సంగతి తెలిసిందే.