- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Paytm తో HDFC ఒప్పందం.. ఎందుకంటే ?
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల విభాగంలో పట్టును సాధించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. దీనికోసం ప్రముఖ డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ పేటీఎంతో భాగస్వామ్యం చేసుకున్నట్టు సోమవారం వెల్లడించింది. ఇరు సంస్థలు డిజిటల్ చెల్లింపులతో పాటు రుణాలు, పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) పరిష్కరాలను అందించనున్నాయి. ప్రధానంగా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను జారీ చేయడం కోసం ఈ భాగస్వామ్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. పండుగ సీజన్ ప్రారంభానికి ముందు ఈ కో-బ్రాండెడ్ కార్డుల విక్రయాలను ప్రారంభించనున్నట్టు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ నాటికి అన్ని రకాల పథకాలను తీసుకొచ్చే అవకాశాలున్నాయి. చిన్న వ్యాపార సంస్థలకు, వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకుని వీసా ద్వారా ఈ కో-బ్రాండెడ్ కార్డులను ఇవ్వనున్నాయి.
అలాగే, ‘బై నౌ, పే లేటర్, ఈఎంఐ సౌకర్యాలు సహా రివార్డ్ పాయింట్లను ఆఫ్ర్ చేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రణాళికను కలిగి ఉంది. ఈ విభాగంలో పట్టును సాధించేందుకు బ్యాంకు ఇప్పటివరకు లేని ప్రత్యేక ఆఫర్లను ఈ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల రూపంలో అందించాలని భావిస్తోంది. పట్టణ ప్రాంత వినియోగదారుల నుంచి గణనీయమైన మద్దతు లభిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంచనా వేస్తోంది. కాగా, పేటీఎం సంస్థ 33 కోట్ల మందికి పైగా వినియోగదారులను, 2.1 కోట్ల వ్యాపారులను కలిగి ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 50 లక్షల డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులను కలిగి ఉంది. అలాగే, ఆఫర్ల ద్వారా 20 లక్షల వ్యాపారులకు సేవలందిస్తోంది.