- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టు నిలదీత
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఎమర్జెన్సీ కేసులను ఆస్పత్రి వర్గాలు 10 నిమిషాల్లో అటెండ్ చేసి పేషెంట్లకు ఆక్సిజన్, మెడిసిన్స్ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు ప్రశ్నించింది. మహారాజ అగ్రసేన్ హాస్పిటల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ సర్కార్‌పై జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా మండి పడింది. ఈ ఆదేశాలను ప్రభుత్వం తన అంతరాత్మను సంతృప్తి పరుచుకునేందుకు పేపర్ పై చేసిన యాక్షన్‌గా ధర్మాసనం అభివర్ణించింది. కేవలం దీనితోనే ప్రభుత్వం తన బాధ్యత తీరిపోయిందనుకుంటుందా అంటూ ప్రశ్నించింది. ఎమర్జెన్సీ పేషెంట్లను 10 నిమిషాల్లో అటెండ్ చేయాలన్న సర్కార్ ఆదేశాలపై మహారాజ ఆస్పత్రి తరఫున అడ్వకేట్ అలోక్ అగర్వాల్ వాదిస్తూ.. ఇప్పటికే ఆక్సిజన్ అవసరాల కోసం వచ్చిన పేషెంట్లతో ఎమర్జెన్సీ వార్డులు నిండి ఉంటున్నాయి. ఇలాంటి తరుణంలో మరో పేషెంట్‌ను అడ్మిట్ చేసుకునేందుకు ఇప్పటికే ఉన్న వారిని చంపలేము కదా అని అన్నారు. దీనిపై హైకోర్టు స్పందించింది. ‘ప్రభుత్వం కేవలం ఆదేశాలు జారీ చేస్తోంది. కానీ దానికి గ్రౌండ్ రియాల్టీ తెలియడం లేదు. అసలు ఇలాంటి ఆదేశాలు ఎందుకు జారీచేస్తున్నారు’ అని కోర్టు ప్రశ్నించింది.