ప్రతీ ఒక్కడి రివ్యూ చూసేంత టైమ్ లేదు : కనిక థిల్లాన్

by Shyam |   ( Updated:2021-07-08 03:23:46.0  )
Kanika Dhillon
X

దిశ, సినిమా : తాప్సీ పన్ను నటించిన ‘హసీనా దిల్‌రుబా’ గతవారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన సంగతి తెలిసిందే. ఒక చిన్న పట్టణంలో ఒక గృహిణి చుట్టూ అల్లుకున్న మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే తన భర్త హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రాణి కశ్యప్(తాప్సీ) పాత్రకు టాక్సిక్ రిలేషన్‌షిప్స్‌తో పాటు సినిమాలో డొమెస్టిక్ వయొలెన్స్‌ చూపించడం పట్ల ఒక వర్గానికి చెందిన క్రిటిక్స్‌, ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాగా ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్‌గా పనిచేసిన కనిక థిల్లాన్.. తాను ఇలాంటి కామెంట్లను పట్టించుకోనని, మూవీని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకే ఇంపార్టెన్స్ ఇస్తానని చెబుతోంది.

‘నిజానికి ఇండియాలో రివ్యూస్ ఎవరు రాయాలి? ఎవరు రాయకూడదనే విషయంలో గైడ్‌లైన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏం లేవు. ఏదైనా మీడియా ప్లాట్‌ఫామ్‌ దొరికితే చాలు.. ఇష్టమొచ్చినట్టు రాసేస్తున్నారు. నాకు ఆ రివ్యూలన్నీ చూసేంత టైమ్ లేదు. ఎందుకంటే నేను సినిమాలతో బిజీగా ఉన్నాను’ అని కనిక నెగెటివ్ రివ్యూలపై తన ఒపీనియన్ చెప్పింది. నిజానికి మిక్స్‌డ్ ఒపీనియన్స్‌తో రాసిన రివ్యూలను ఎంజాయ్ చేశానన్న కనిక.. బ్యాలన్స్‌డ్‌గా ఉన్న, హిస్టారికల్‌గా లేని సమీక్షలు మాత్రమే చూస్తాను తప్ప, వాటిపై ట్రోలింగ్‌ ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేనని తెలిపింది.

Advertisement

Next Story