పాకిస్తాన్‌కు వెళ్లిపో.. హర్యానా హోంమంత్రి

by Shamantha N |
anil-vij
X

చండీగర్: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబ వ్యాఖ్యలపై హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ మండిపడ్డారు.‘ నీకు పాకిస్తాన్ అంతబాగా నచ్చితే, అక్కడికే వెళ్లిపో’ అంటూ ట్విట్టర్ వేదికగా ఘూటుగా విమర్శలు సంధించారు. అమెరికా అనేది పక్కదేశంలో సైనిక తిష్ట వేసింది. మనం మన దేశంలో ఉన్నాం. మా దేశంలో ఉన్న మమ్మల్నే వెళ్లిపొమ్మంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీకంతగా పాకిస్తాన్ పై ప్రేమే ఉంటే, అక్కడికే వెళ్లూ, ఇక్కడ మీలాంటి వాళ్లు అనుభవిస్తున్న ఆనందం అక్కడ చాలా దూరంలో ఉంది వెళ్లండి అంటూ వ్యంగ్యాస్త్రాలు ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శనివారం ఓ ర్యాలీలో మాట్లాడిన మెహబూబ ముఫ్తీ ‘ అమెరికా కూడా అప్ఘాన్ నుంచి వెళ్తుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ నేతలతో చర్చలు ప్రారంభించాలి. మా ఓపికకు కూడా హద్దు ఉంటందని, తిరిగి జమ్ముకశ్మీర్‌లో అధికరణ 370, 35 ఏలను చేర్చాలంటూ న్యూఢిల్లీ పై బెదిరింపులకు దిగిన సంగతి విదితమే.

Advertisement

Next Story