విద్యార్థులకు ఫ్రీ టాబ్లెట్స్ : ఖట్టర్

by Shamantha N |
విద్యార్థులకు ఫ్రీ టాబ్లెట్స్ : ఖట్టర్
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థులు తమ అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేందుకు వారికి ఉచితంగా పీసీ టాబ్లెట్స్ పంపిణీ చేయాలని నిర్ణయించింది.

తొలుత ఎనిమిదవ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్రం పాఠశాలలు తెరిచేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపించేందుకు జంకుతున్నారు.

డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నా పేద విద్యార్థులు ఇంట్లో టీవీ, సెల్ఫోన్, ఇంటర్నేట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ విద్యార్థులందరికీ ఉచితంగా టాబ్లెట్స్ అందజేయాలని, విద్యార్థులు అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed