మంటల్లో హరితహారం.. నిర్లక్ష్యానికి బుగ్గిపాలు..

by Shyam |   ( Updated:2021-11-25 10:28:13.0  )
మంటల్లో హరితహారం.. నిర్లక్ష్యానికి బుగ్గిపాలు..
X

దిశ, నేరేడుచర్ల: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతోంది. ఇందులో భాగంగా హరితహరం పోగ్రామ్ ని ఏర్పాటు చేసి మొక్కలు నాటి, వాటి రక్షణ చర్యలు చేపడుతోంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల నుండి జాన్ పహాడ్ వెళ్ళే ప్రధాన రహదారికి ఇరువైపులా అదికారులు మెుక్కలను నాటించారు. దాని పక్కనే నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామపంచాయతీ డప్పింగ్ యార్డ్ ను ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డులో పోసినా వ్యర్థ పదార్థాలు గాలికి చిందరవందరై ఆ ప్రాంతమంతా వ్యాపించాయి.

గురువారం ఆ డంపింగ్ యార్డులో పోసిన వ్యర్థపదార్థాలకు నిప్పంటించి వెళ్లారు. గాలికి మంటలు ఎగిసిపడి హరితహరం మొక్కలకు చుట్టూ ఏర్పాటు చేసిన ట్రీ గార్డ్స్ అంటుకున్నాయి. దాంతో ఆ మెుక్కలు చాలా వరకూ కాలిపోయాయి. ఈ మంటల కారణంగా పొగలు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇలా గ్రామపంచాయతీ అధికారులు సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లనే ఈ రోజు మొక్కలు మంటల్లో కాలిపోయాయని పలువురు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story