జోగిపేటలో హరీష్ రావు పర్యటన

by Shyam |
జోగిపేటలో హరీష్ రావు పర్యటన
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపాలిటీలో మంత్రి హరీశ్ రావు పర్యటించి లాక్ డౌన్ పరిస్థితులను పరిశీలించారు. జోగిపేటలో అనవసరంగా వాహనాలపై తిరుగుతున్న వారిని తిరుగొద్దంటూ హెచ్చరించారు . అలా తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. రోడ్లపై ఎవరు తిరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు . జోగిపేటలో ఫైరింజన్‎లతో హైపోక్లోరైడ్ సోడియంతో చేస్తున్న పిచికారిని ఆయన పరిశీలించారు . అనంతరం అందోల్ – జోగిపేట మున్సిపల్ కార్యాలయంలో లాక్ డౌన్ దృష్ట్యా . . అధికారులతో , పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Tags: Harish Rao’s, visit, Jogipeta, sangareddy

Advertisement

Next Story