- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన హరీష్ రావు..
దిశ, మెదక్ : మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఏడుపాయల్లో అత్యంత అట్టహాసంగా జరుగుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడుపాయల వనదుర్గా భవాని మాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు, ఆయన వెంట మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, ఆలయ ఈవో సార శ్రీనివాస్‌లు ఉన్నారు. ఆలయ మర్యాదలతో ఈవో సార శ్రీనివాస్, పురోహితులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడుపాయల ఉత్సవాలు దినదిన అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఉత్సవాలు ఘనంగా జరగడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. కోటి రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని,అలాగే ప్రతి సంవత్సరం భక్తులకోసం సింగూరు నుండి 0.35.టీఎంసీల నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శివుడు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని మొక్కినట్టు తెలిపారు. చారిత్రక నేపథ్యం ఉండి ప్రసిద్ధి గాంచిన ఏడుపాయలను మరింత అభివృద్ధి చేయడం, భక్తుల సౌకర్యం కోసం వచ్చే సంవత్సరం వరకు 50 లక్షల రూపాయలతో మహిళల కోసం స్నానఘట్టాలను, ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తుల కోసం అన్ని సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్‌కు కూడా ఏర్పాటు రంగం సిద్ధం చేశామని తెలిపారు. రాబోయే కాలంలో ఏడుపాయల్లో షాపింగ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.