'హార్దిక్ పాండ్యా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కూడా పనికి రాడు'

by Shyam |
Pandya
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియాలోకి ఆల్‌రౌండర్‌గా అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా ఈ మధ్య బౌలింగ్ మానేసి కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడు. వెన్నునొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం అతడు పూర్తిగా బౌలింగ్ చేయడం మానేశాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌కు సెలెక్టర్లు హార్దిక్ పాండ్యాను పరిగనలోకి తీసుకోలేదు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనకు హార్దిక్ బదులు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లను ఎంపిక చేశారు.

కాగా, హార్దిక్ పాండ్యా కనుక బౌలింగ్ చేయకపోతే అతడిని పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కూడా ఎంపిక చేయాల్సిన అవసరం లేదని మాజీ సెలెక్టర్ శరణ్ దీప్ సింగ్ వ్యాఖ్యానించాడు. టెస్టు జట్టుకు హార్దిప్ పాండ్యాను ఎంపిక చేయకపోవడం మంచిదే అని ఆయన ప్రస్తుత సెలెక్టర్లకు మద్దతు ఇచ్చాడు. టెస్టుల్లో సుదీర్ఘంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ, వన్డేల్లో కేవలం 10 ఓవర్లు, టీ20లో కేవలం 4 ఓవర్లే బౌలింగ్ చేయాలి. ఆ మాత్రం కోటాను కూడా పూర్తి చేయలేకపోతే హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడం అనవసరం అని శరణ్ దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. అయితే పృథ్వీషాను ఇంగ్లాండ్ పర్యటనలో కనీసం స్టాండ్ బై బ్యాట్స్‌మాన్‌గా కూడా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచిందని అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed