- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పని చేసినా వేధింపులా..? డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల ఆవేదన
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సమయంలో శక్తికి మించి పని చేస్తున్నామని, అతి తక్కువ మంది సిబ్బందితో గరిష్ఠ స్థాయిలో విధులు నిర్వహించాల్సి వస్తున్నదని, అయినా కొద్దిమంది ఉన్నతాధికారులతో ఇబ్బందులు పడుతున్నామని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తరచూ నిర్ణయాలు మారుస్తూ ఉండడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు.
కరోనా తొలి వేవ్‌లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులను ఫ్రీజ్ చేయడం మొదలుకుంటే ఇప్పుడు రెమిడెసివిర్, ఆంఫోటెరిసిన్ మందులను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచకుండా చేయాల్సి వస్తోందని, తాజాగా ఫ్లుకొనజోల్, ఓరికొనజోల్, పొసకొనజోల్ లాంటి వాటిని కూడా మందుల షాపుల్లో విక్రయించకుండా ఆంక్షలు విధించాల్సి వచ్చిందని, దీని కారణంగా కరోనా కాకుండా ఇతర రోగాలతో బాధపడుతున్నవారికి చాలా సమస్యలు ఎదురవుతున్నాయని డ్రగ్స్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌కు 24 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు రాసిన లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రం మొత్తానికి 71 మందే ఇన్‌స్పెక్టర్లు
తెలంగాణ మొత్తానికి 71 మంది మాత్రమే డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారని, ఇందులో 57 మంది అసిస్టెంట్ డైరెక్టర్ బాధ్యతలు కూడా చూసుకుంటున్నరని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ సరఫరా క్రమబద్ధీకరణ మొదలు.. తాజాగా పొసకొనజోల్ వరకు అన్నింటికీ క్షేత్రస్థాయిలో పర్యటించడం ఇబ్బందిగా మారిందని ఆ లేఖలో ఇన్‌స్పెక్టర్లు పేర్కొన్నారు. నిత్యం ఫీల్డు మీదనే ఉండాల్సి వస్తోందని, ప్రతీరోజు రిపోర్టును, మందుల లెక్కలను క్రోడీకరించాల్సి వస్తోందని వాపోయారు. మందుల దుకాణాలను తనిఖీ చేయడం, అవకతవకలను అరికట్టడం లాంటివాటితో పాటు డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల దగ్గర స్టాకును చెక్ చేయాల్సి వస్తున్నదని వివరించారు.
ఇన్ని చేసినా కొద్దిమంది ఉన్నతాధికారులు అదనపు బాధ్యతలు అప్పగించి చేయలేకపోయారంటూ పర్‌ఫార్మన్స్ రిపోర్టులో రిమార్కులు రాస్తూ సస్పెండ్ చేస్తున్నారని, గోవింద్ సింగ్‌పైన సస్పెన్షన్ వేటు వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కోవడం మనుషులకు అసాధ్యమని, నాలుగేళ్ళుగా పదోన్నతులు కూడా లేవని వాపోయారు. తక్షణం గోవింద్ సింగ్‌పై సస్పెన్షన్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శక్తికి మించి పనిచేస్తున్నా మౌఖిక ఆదేశాలను అమలుచేయలేదన్న కారణంతో క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం పనిచేయాలన్న ఉత్సాహాన్ని నీరుగారుస్తోందని, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను మానసిక క్షోభకు గురిచేస్తున్నదని వివరించారు.
ఫీల్డ్ వర్క్ కోసం రోడ్డెక్కిన ప్రతీసారి వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నదని, ఇప్పటివరకు ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించలేదని, వ్యాక్సిన్ కూడా ఇవ్వలేదని, కనీసం ప్రాధాన్యతను కూడా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న సమయంలో బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడానికి రీఫిల్లింగ్ కేంద్రాలను సందర్శిస్తూ పని భారానికి గురయ్యామని వాపోయారు. ఇంత చేసినా సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం బాధిస్తోందని ఆ లేఖలో డైరెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. తక్షణం గోవింగ్ సింగ్‌కు జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశారు.