- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
30 ఏళ్లు దాటినా పెళ్లికి నో అంటున్న అబ్బాయిలు.. ఇందుకేనట
దిశ, వెబ్‌డెస్క్: 30 ఏళ్లు దాటాయి ఇంకెప్పుడు పెళ్లి చేసుకొంటావు రా..? అమ్మానాన్నల గొడవ. ఏరా నీకు పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదా..? బంధువుల ఆరా. నీతోటి స్నేహితులందరికీ పెళ్లై , పిల్లలు కూడా ఉన్నారు.. నువ్వెప్పుడూ చేసుకొంటావురా.. బామ్మ ప్రశ్న. వీడికి ఇక జన్మల్లో పెళ్లి కాదు.. స్నేహితుల హేళన. ఇలా రోజు ప్రశ్నలతో కాలక్షేపం చేస్తున్నా పెళ్ళికి మాత్రం అంగీకరించని పెళ్లి కానీ ప్రసాద్ లు ఎంతోమంది.అయితే వారికి పెళ్లి ఇష్టంలేక కాదు.. కానీ వారి మనసులో మెదిలే ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి. ప్రస్తుత సమాజంలో 30 ఏళ్ళు దాటినా పెళ్లికి నో చెప్తున్న అబ్బాయిలే ఎక్కువ మంది ఉన్నారడంలో అతిశయోక్తి కాదు. వారు నో చెప్పడానికి వెనక చాలా కారణాలే ఉన్నాయట..
ఇతర దేశాల్లో 35 ఏళ్ల వయసులో 6వేలకు పైగా ఒంటరి పురుషుల ఉన్నట్లు కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అయితే వారు అన్నిఏళ్లు వచ్చి ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడగగా వారు చెప్పిన సమాధానాలు కొన్ని విచిత్రంగా ఉంటే, మరికొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి. నేను అందంగా లేనని, బట్ట తల ఉందని, పొట్ట వచ్చిందని, వెంట్రుకలు తెల్లబడ్డాయని, ఇంకొందరు ఎత్తు లేమని పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చారు. మరికొంతమంది భార్యను సుఖపెట్టలేనేమోనన్న భయంతో పెళ్ళికి నో చెప్తున్నారట.
ఇంకా మరికొందరు తామింకా ఉద్యోగంలో సెటిల్ కాలేదని, భార్యాపిల్లలను పోషించే స్థోమత లేక చాలా మంది వివాహం చేసుకోవడం లేదని పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే మరికొంతమంది అబ్బాయిలు చెప్పిన సమాధానాలు షాక్ కి గురిచేస్తున్నాయి. నాకు అమ్మాయిలతో మాట్లాడడం సిగ్గు.. వారు దగ్గరకి వస్తేనే పారిపోతాను. దీని వలనే నేను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని ఓ వ్యక్తి చెప్పాడు. మితిమీరిన సిగ్గు, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియకపోవడం వలన చాలామంది అబ్బాయిలు పెళ్ళికి నో చెప్తున్నారట.