మాకు ఒక ఐపీఎల్ టీమ్ కావాలి

by Anukaran |
మాకు ఒక ఐపీఎల్ టీమ్ కావాలి
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021లో రెండు కొత్త టీమ్స్‌ను జత చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఖరారు అయినట్లు అనధికారికంగా బీసీసీఐ వర్గాలు సమాచారం అందించాయి. మరో ఫ్రాంచైజీ లక్నో, పూణే లేదా కోచిలలో ఒకటి ఉంటుందని అందరూ ఊహిస్తున్నారు. అయితే తాజాగా అస్సామ్ నుంచి గౌహతీ (గుహవాటి) కేంద్రంగా కొత్త ఫ్రాంచైజీ తీసుకొని రావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నెల 24న బీసీసీఐ ఏజీఎం జరగనున్న నేపథ్యంలో అస్సామ్ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఈ ప్రతిపాదన చేసింది. రాబోయే సీజన్‌లో కొత్త ఫ్రాంచైజీలు రానున్న నేపథ్యంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈశాన్య రాష్ట్రాలు కోరుతున్నాయి. మరోవైపు గుహవాటి కేంద్రంగా ఐపీఎల్ ఫ్రాంచైజీని తీసుకోవడానికి పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా మరో మూడు రోజుల్లో జరుగనున్న ఏజీఎం ముగిసే వరకు ఐపీఎల్ జట్లపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Advertisement

Next Story