- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారీగా పట్టుబడిన అంబర్, గుట్కా ప్యాకెట్లు..
దిశ, నర్సంపేట: నర్సంపేట డివిజన్ పరిధిలో గడచిన కొంత కాలంగా అసాంఘిక కార్యకలాపాల పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్న నిషేదిత అంబర్, గుట్కా నిల్వ చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపడుతున్నారు. నర్సంపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్ పులి. రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట పట్టణంలోని ఎన్.జీ.ఓ.ఎస్ కాలనీలో గుట్కా నిల్వ చేశారన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు చేరింది.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సంబంధిత ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. దాదాపు లక్ష రూపాయల విలువగల అంబర్, జే.కే, ఆర్.ఆర్ లను పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామానికి చెందిన రచ్చ నాగేశ్వరరావు గా అతన్ని గుర్తించారు.
అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని సీఐ పులి రమేష్ హెచ్చరించారు. ఈ సోదాల్లో సీఐ తో పాటుగా ఎస్సై రాం చరణ్, కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.