వైద్య ప్రమాణాలు మెరుగుపరిచేందుకే ఆకస్మిక తనిఖీలు : కలెక్టర్ రాహుల్ రాజ్

by Aamani |
వైద్య ప్రమాణాలు మెరుగుపరిచేందుకే ఆకస్మిక తనిఖీలు : కలెక్టర్ రాహుల్ రాజ్
X

దిశ, కౌడిపల్లి : జిల్లాలో వైద్య ప్రమాణాలు‌ మెరుగుపరిచేందుకే ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఈ రోజు ( శనివారం) తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు సిబ్బందిలో మార్పు వచ్చిందని గతంలో కంటే ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగయ్యాయని కలెక్టర్ అన్నారు. దవాఖానలోని ఓపీ రిజిస్టర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు అత్యుత్తమ, నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఆసుపత్రిలోని విభాగాల మెరుగైన నిర్వహణకు తార్కాణాలుగా పేర్కొన్నారు.

కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక పరికరాలు, మౌలిక సదుపాయాలు వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారని చెప్పారు. జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఇన్ పేషెంట్ వసతుల విషయంలో బెడ్లు, బెడ్ షీట్లు మరుగుదొడ్లు, మెరుగుపరుస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం క్లస్టర్ వారీగా తీసుకుని హెడ్ క్వార్టర్ లో ఉండే మహిళలే కాకుండా సుదూర ప్రాంత మహిళలకు కూడా ఈ సదుపాయం అదే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

Next Story

Most Viewed