కశ్మీర్‌లో గుప్కార్ కూటమికి మెజార్టీ

by Shamantha N |   ( Updated:2020-12-22 10:16:05.0  )
కశ్మీర్‌లో గుప్కార్ కూటమికి మెజార్టీ
X

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ జిల్లా అభివృద్ధి సమితి ఎన్నికల్లో గుప్కార్ అలయెన్స్ మెజార్టీ సాధించింది. బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. కాగా, కేంద్రం మద్దతుతో బరిలోకి దిగిన జమ్ము కశ్మీర్ అప్ని పార్టీ ఖాతా తెరవలేదు. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ సహా ఆరు స్థానిక పార్టీలు సంయుక్తంగా గుప్కార్ అలయెన్స్‌గా ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

గుప్కార్ అలయెన్స్ 111 స్థానాల్లో, బీజేపీ 64 స్థానాల్లో, కాంగ్రెస్ 23 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాగా, ఈ ఫలితాలపై నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ఒమర్ అబ్దుల్లా హర్షం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రజలు ఈ తీర్పుతో వెల్లడించారని పేర్కొన్నారు. 370ని పునరుద్ధరించే తమ పోరాటానికి ఈ ఫలితాలతో ప్రజల మద్దతు లభించిందని తెలిపారు. ఈ ఎన్నికలను తాము రెఫరెండమ్‌గా భావించమని, బీజేపీనే రెఫరెండమ్‌గా చిత్రించిందని పేర్కొన్నారు.

Advertisement

Next Story