జమ్మూ కాశ్మీర్‌కు మళ్లీ ఆ హోదా ఇవ్వండి: గుప్కర్ నాయకులు

by Shamantha N |
జమ్మూ కాశ్మీర్‌కు మళ్లీ ఆ హోదా ఇవ్వండి: గుప్కర్ నాయకులు
X

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎కు మునుపటి రాష్ట్ర హోదాను పునరుద్దరించాలని గుప్కర్ నాయకులు డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్ కు మాత్రమే ప్రత్యేకంగా ఉన్న అధికరణ 370, అధికరణ 35 ఏ రద్దు చేసి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీనగర్ లో వివిధ రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహించాయి. కాశ్మీర్ లోయలోని శ్రీనగర్ వీధుల్లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ సహ ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. తమ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలను, ఎన్ కౌంటర్లను ఆపాలని డిమాండ్ చేశారు. జైళ్లలో వేసిన రాజకీయ నాయకులను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని పీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ముందుండి నడిపించారు. తమ రాష్ట్రంలో నల్ల చట్టాలు అమలు చేశారని, అప్పటి నుంచి కాశ్మీర్ లో అరాచకాలు ఎక్కువయ్యాయని ముఫ్తీ ట్వీట్ చేశారు. ఈ అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం తప్పదని స్పష్టం చేశారు. ఆందోళన సందర్భంగా శ్రీనగర్ లో ప్రజాజీవనం స్తంభించింది. అయితే లోయలోని మిగత ప్రాంతాల్లో ఎక్కడ ఆందోళనల ప్రభావం కనిపించలేదు. అన్ని వ్యాపార కార్యక్రమాలు, ప్రజాజీవనం యదావిథిగా సాగాయి. ఈ ఆందోళన తరువాత గుప్కర్ అలయెన్స్ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఇంట్లో సమావేశమయ్యారు. కాగా 2019 ఆగష్ట్ 5 న భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే నిబంధనలు రద్దు చేసి, జమ్మూకాశ్మీర్, లఢక్ లను వేరు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది. ప్రధాని

జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేకం ప్రతిపత్తిని రద్దు చేయటం వల్ల రాష్ట్రం ప్రశాంతంగా ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తాము కశ్మీర్ లోయ నుంచి నిర్థాక్షిణ్యంగా బయటకు పంపించబడ్డ పండిట్లను తిరిగి వారి సొంతగూటికి చేరుస్తామని తెలిపారు. ఇప్పటికే కొన్ని వందల కుటుంబాలు తమ సొంత రాష్ట్రానికి చేరుకోవడానికి ఉత్సాహం చూపుతున్నాయని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హమీ ఇచ్చారు.

Advertisement

Next Story