తెలుగోడి ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. జాగ్వార్‌‌‌ను పెంచుతున్న తణుకు వాసి!

by srinivas |   ( Updated:2021-10-24 06:03:14.0  )
తెలుగోడి ధైర్యానికి నెటిజన్లు ఫిదా.. జాగ్వార్‌‌‌ను పెంచుతున్న తణుకు వాసి!
X

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా జంతు ప్రేమికులు అంటే చాలా మందే ఉంటారు. వీరు కుక్కలు, పిల్లులు లేదంటే పక్షులను పెంచుకుంటారు. క్రూరమృగాలను పెచుకోవటం మాత్రం చాలా అరుదు. అయితే, ఈ జాబితాలో దుబాయ్ షేక్స్ కూడా ఒకరు. కానీ, దేశానికి చెందిన వ్యక్తి.. అది కూడా తెలుగు వాడు జాగ్వార్‌ను పెంచడం ఇప్పుడు యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం అతడు జాగ్వార్ కుమార్ అన్న పేరుతో ఫేమస్ అవుతున్నాడు. దాని పెంపకం మామూలు ఖర్చుతో కూడుకున్న పని కాదు. నెలసరి ఖర్చే దాదాపు లక్ష అవుతుంది. అయినా, ఏమాత్రం వెనకాడకుండా ఆ వ్యక్తి దానిని పెంచుతున్నాడు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన వ్యక్తి ఉక్రెయిన్‌లో ఉంటూ చిరుత పులి జాతికి చెందిన జాగ్వార్‌ను చిన్నప్పుడే తీసుకొచ్చి పెంచుతున్నాడు. ఇప్పుడు ఆ క్రూరమృగం వయసు 8 నెలలకు పైగా ఉంది. దానిని తన సొంత కొడుకులా పెంచుకుంటున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం ఆయన బ్లాక్ పాంతర్ (పులికి జాతి)కి చెందిన మరో మృగాన్ని తెచ్చుకునే ఆలోచనలో ఉన్నాడు. మరి అతడి కుటుంబంలో ఈ పాంతర్ ఎప్పుడు కలుస్తుందని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed