గులాబీ ప్రభుత్వం ‘గులాబ్’ రైతులను ఆదుకోవాలి

by Sridhar Babu |
Madhavi
X

దిశ,పాలేరు: గులాబ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రామ సహాయం మాధవి రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పాలేరు రిజర్వాయర్ చుట్టూ వరద వల్ల నష్టపోయిన రైతుల వ్యవసాయ క్షేత్రాలను మాధవిరెడ్డి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాలేరు ఓల్డ్ కెనాల్ గేట్లు మొరాయించాయిడంతో వందలాది ఎకరాలు నీట మునిగి రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయరన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు ముందుచూపు లేని కారణంగానే పాలేరు జలాశయం షెట్టర్స్ పనిచేయడం లేదని, దీనిలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతుందన్నారు.

madhavi Reddy

ఇంత నష్టం జరిగినా కనీసం ముంపు పొలాలను స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పరిశీలించి నష్టపరిహారం ఇప్పించకపోవడం దారుణమన్నారు. పాలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ వలన ఇప్పటికి నాలుగు సార్లు పొలాలు మునిగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంకెన వాసు, ఎడవెల్లి రాంరెడ్డి, తుపాకుల వెంకన్న, ఉల్లోజు తిరుమల్లేష్, రైతులు ఎడవెల్లి పుల్లారెడ్డి, బండ్ల వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు బత్తుల వీరబాబు, ఇస్లావత్ శివ, బత్తుల అంజయ్య, ఎడవెల్లి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story