- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుజరాత్ పోలీసులను పరుగులు పెట్టిస్తున్న ఒక్క కేసు.. యువతి కాళ్లు చేతులు కట్టేసి.. రైల్లో అలా..!
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో క్రైం రేటు క్రమంగా పెరుగుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరస్తులు కూడా సులువుగా క్రైం చేసేస్తున్నారు. అనంతరం దాని ఆనవాళ్లు కనిపించకుండా చేసి తప్పించుకు తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఓ క్రైం అక్కడి పోలీసులను రాత్రింబవళ్లు పరుగులు పెట్టిస్తోంది. నిందితులను పట్టుకునేందుకు సుమారు 25 బృందాలు, 450 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాయి.
పోలీసులను నిద్ర లేకుండా చేస్తున్న ఆ కేసు ఏంటంటే.. వల్సద్ రైల్వేస్టేషన్‌లో గుజరాత్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచి ఉన్నది. దానిని క్లీన్ చేస్తున్న టైంలో ఓ యువతి మృతదేహాన్ని రైల్వే సిబ్బంది గుర్తించి ఆర్ఫీఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు బాడీతో పాటు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. అది తెరిచి చదివిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతేకాకుండా పోస్టుమార్టం నివేదికలో ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. అయితే, ఆ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగి ఉండవచ్చని, అందుకే ఆత్మహత్య చేసుకుంది కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డైరీలో మృతురాలి రాసిన వివరాలు కూడా అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
వివరాల్లోకివెళితే.. సౌత్ గుజరాత్‌కు చెందిన యువతి వడోదరాలోని ఓ హాస్టల్లో ఉంటూ ఓ ఎన్‌జీవో సంస్థలో పనిచేస్తోంది. డైరీలో రాసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 4వ తేదీన ఇద్దరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారని.. కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి ఆటోలో ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లారని అందులో ఉంది. అదే టైంలో ఓ బస్ డ్రైవర్ ఆమెను రక్షించి తన స్నేహితురాలి వద్దకు చేర్చినట్టు డైరీలో పేర్కొంది.
ఈ వివరాలను బట్టి యువతిపై గ్యాంగ్ రేప్ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ డైరీలో గ్యాంగ్ రేప్ జరిగినట్టు ఎక్కడా రాయలేదు.దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న వడోదరా ఐజీ సుభాష్ త్రివేది మీడియాకు తెలిపారు. ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు ఇప్పటికే 25 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్నారు. దాదాపు 450 సీసీటీవీ కెమెరాలను పరిశీలించినట్టు తెలిపారు. మృతురాలికి సంబంధించి మరిన్ని మెడికల్ రిపోర్టులు రావాల్సి ఉందని, అప్పుడే బాధితురాలి మృతికి సంబంధించి, గ్యాంగ్ రేప్ పై జరిగిందా? లేదా అనే దానిపై క్లారిటీ వస్తుందన్నారు.యువతి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.