- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సిన్ ఇంటికి తెప్పించుకున్న సింగర్.. వేటు ఎవరిపై?
దిశ, సినిమా: టీమిండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్.. కాన్పూర్‌లోని తన గెస్ట్ హౌస్‌లో వ్యాక్సిన్ వేయించుకోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉంటే, తాజాగా గుజరాతీ ఫోక్ సింగర్ గీతా రబారి.. కచ్ జిల్లాలోని తన ఇంట్లో టీకా తీసుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న జిల్లా అధికార యంత్రాంగం.. సింగర్‌కు వ్యాక్సిన్ ఇచ్చిన మహిళా హెల్త్ వర్కర్‌కు షోకాజ్ నోటీస్ జారీచేసింది. వ్యాక్సినేషన్ కోసం శనివారం స్లాట్ బుక్ చేసుకున్న ఈ 25 ఏళ్ల గుజరాతీ సింగర్.. పబ్లిక్ హెల్త్ సెంటర్‌కు వెళ్లకుండా స్వగ్రామం మాదాపూర్‌లోని తన ఇంట్లోనే వ్యాక్సిన్ తీసుకుందని తెలిపిన కచ్ డీడీవో భవ్య.. సింగర్ ఇంటికి వెళ్లిన హెల్త్ స్టాఫ్‌ను గుర్తించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు వెల్లడించింది.
ఇక గీతా రబారి తను ఇంట్లోనే వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రులు సైతం టీకా కోసం వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లడం కనిపించట్లేదా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా నమస్తే ట్రంప్ ఈవెంట్‌లో పర్ఫార్మ్ చేసిన ఈ సింగర్ తన ఫొటోపై విమర్శలు రావడంతో వెంటనే డిలీట్ చేసింది.