- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంచలనం: గుజరాత్ ముఖ్యమంత్రి రాజీనామా
Breaking: Gujarat CM Vijay Rupani resigns along with his cabinet ministers
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ రాజకీయ వర్గాల్లో శనివారం సంచలన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రులతో సహా ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖలను రాష్ట్ర గవర్నర్‌కు పంపించారు. కాగా, 2016 నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Gujarat CM Vijay Rupani) కొనసాగుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే తన పదవికి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతేగాకుండా.. ఇటీవలే కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చిన బీజేపీ అధిష్టానం, అదే స్టంట్‌ను గుజరాత్‌లోనూ కొనసాగిస్తోందా అనే అనుమానాలు పార్టీ వర్గాల్లో రేకెత్తుతున్నాయి. కాగా, గత కొంతకాలంగా విజయ్ రూపానీని తీవ్ర అనారోగ్య సమస్యలు వేధిస్తున్నట్లు సమాచారం.
‘గుజరాత్ సీఎంగా అవకాశం ఇచ్చినందుకు బీజేపీకి ధన్యవాదాలు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు దక్కింది’ అని జాతీయ మీడియాతో తెలిపారు.
“I want to thank BJP for giving me this opportunity to serve as Gujarat’s CM. During my tenure, I got the opportunity to add to the development of the state under Prime Minister Narendra Modi’s leadership,” Rupani was quoted as saying by ANI.