సింగరేణి ఉద్యోగులూ జాగ్రత్త..

by Ramesh Goud |
సింగరేణి ఉద్యోగులూ జాగ్రత్త..
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో సింగరేణి ఉద్యోగులు సోషల్ డిస్టెన్స్ పాటించేలా పలు జాగ్రత్తలు తీసుకోనున్నామని యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు సోమవారం యాజమాన్యం ఒక సర్క్యులర్ జారీ చేసింది. లాక్ డౌన్ నుంచి ఎలక్ట్రిసిటీ సర్వీసులను మినహాయిస్తున్నట్టు ప్రభుత్వం జీవో నం. 45లో పేర్కొన్న విషయాన్ని యాజమాన్యం ఈ సర్క్యులర్‌లో కోట్ చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్లకు కోల్ సప్లై ఆగిపోకుండా ఉండడానికి గనుల్లో ఉద్యోగులు నియమిత సమయాల్లో విధులకు హాజరవ్వాలని, ప్రతి ఒక్కరు తమ చేతులను సానిటైజర్స్ తో తరచూ శుభ్రం చేసుకోవాలని సూచించింది. మ్యాన్ రైడింగ్ సిస్టమ్‌లో, ఇతర వాహనాల్లో ప్రయాణించే ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఎవరైనా ఉద్యోగుల బంధువులు విదేశాల నుంచి వస్తే వెంటనే ఆ విషయాన్ని వెల్లడించాలని ఆదేశించింది. క్యాంటిన్‌లో టీ తప్ప ఎలాంటి అల్పాహారాలు అందుబాటులో ఉండవని, ఇవన్నీ లంచ్ టైంలో కావాల్సిన వారికి పనిచేసే చోటే అందజేస్తామని పేర్కొంది.

Tags: singareni employees, corona, lockdown, social distance

Advertisement

Next Story

Most Viewed