బాబూ… ఎందుకొచ్చారు? ఎందుకు వెళ్లారు?: గుడివాడ

by srinivas |
బాబూ… ఎందుకొచ్చారు? ఎందుకు వెళ్లారు?: గుడివాడ
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌కి ఎందుకు వచ్చారు? మళ్లీ హైదరాబాద్ కు ఎందుకు వెళ్లిపోయారు? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ప్రశ్నించారు. విశాఖపట్టణంలోని వెంకటాపురంలో చోటుచేసుకున్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటనలో బాధితులను పరామర్శించేందుకు అనుమతి తీసుకుని రాష్ట్రానికి వచ్చిన చంద్రబాబునాయుడు అసలు వైజాగ్ ముఖం చూడకుండా ఎందుకు వెనుదిరిగారో చెప్పాలని ఆయన నిలదీశారు. హైదరాబాద్ లో ఉంటే ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించాల్సి వస్తుందని… గ్యాస్ బాధితులను పరామర్శించాలని పర్మిషన్ తీసుకుని సొంత పనులు చేసుకునేందుకు అమరావతి వచ్చి బాధితులను పరామర్శించకుండానే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారని అమర్ నాథ్ ఆరోపించారు. డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలపై ఆయనకు కూడా నోటీసులు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా, తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, అందితే స్పందిస్తానని అమర్‌నాథ్ తెలిపారు. న్యాయస్థానాలు అంటే తమకు గౌరవం ఉందని, తీర్పుపై అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకు వెళతామని అన్నారు. అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed