- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కౌగిలింతలు, ముద్దులతో నిరసన
దిశ, వెబ్‌డెస్క్ : ప్రభుత్వాలు లేదా సంస్థలు తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు అని పలు సందర్భాల్లో న్యాయస్థానాలు కూడా వెల్లడించాయి. అయితే ఆ నిరసన ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండాలని సూచించాయి. కానీ, ఇక్కడొక దేశానికి చెందిన యువత మాత్రం వినూత్నంగా నిరసన తెలిపింది. ఓ ముప్పై యువ జంటలు గుంపులుగా మెట్రోలో ప్రయాణిస్తూ, తమ మాస్కులు తీసేసి ఒకరికొకరు ముద్దులిచ్చుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ నిరసన తెలిపారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ యువ జంటలు ఎందుకు కిస్సింగ్ ప్రొటెస్ట్ చేశారు? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
రష్యాలోని యెకటిరిన్‌బర్గ్ నగరంలో.. కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా అధికారులు పలు నిబంధనలు రూపొందించి అమల్లోకి తీసుకొచ్చారు. మ్యూజికల్ కాన్సర్ట్స్(కచేరి), బార్లకు రాత్రి 11 గంటల వరకే అనుమతివ్వడం అందులో భాగమే. అయితే, దీనిపై అధికారులను ప్రశ్నించిన యువతకు.. ప్రజలు, యువత గుంపులు గుంపులుగా ఉండటం వల్ల కరోనా వ్యాప్తి పెరిగే అవకాశముంటుందని, అందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిబంధనలు కచ్చితంగా అమలు అవుతాయని, ఉల్లం‘ఘనుల’కు కఠిన శిక్షలుంటాయని చెప్పారు. కానీ ఈ యువత మాత్రం సదరు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని కోరింది. అందుకు అధికారులు అంగీకరించకపోవడంతో వాళ్లకు తెలిసేలా వినూత్నంగా నిరసన తమ తెలియజేయాలని నిర్ణయించుకుంది.
యెకటిరిన్‌బర్గ్ సిటీలోని యువకులు ముప్పై జంటలుగా ఏర్పడ్డారు. పబ్లిక్ ఎక్కువగా ఉన్న మెట్రో ట్రైన్‌లో ఎక్కిన వీళ్లంతా ఒక్కసారిగా మాస్కులు తీసేసి, ఒకరికొకరు హత్తుకుంటూ ముద్దులిచ్చుకున్నారు. ఈ సమయంలో ‘పింక్ గ్లాసెస్’ బ్యాండ్ వారు రూపొందించిన ‘లెట్స్ కిస్’ అన్న పాట ప్లే చేశారు. దీంతో ఆశ్చర్యపోయిన తోటి ప్రయాణికులు ఈ యువజంటలను ఫొటోలు, వీడియోలు తీశారు. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరలయ్యాయి. కాగా కొవిడ్ వ్యాప్తి నిరోధించేందుకే అయితే మ్యూజికల్ కాన్సర్ట్స్, బార్లలో కంటే ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రో, బస్సుల్లోనే ఎక్కువ మంది వస్తున్నారని, కానీ అక్కడే నిబంధనలు ఎందుకని యువత ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఇప్పటికే దివాలా అంచున్న ఉన్న హోటల్ పరిశ్రమ.. ఈ నిర్ణయాలతో ఇంకా పతనావస్థలోకి వెళ్తుందని వివరించారు.