- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాతాళం నుంచి పైకొచ్చాయి
దిశ ప్రతినిధి, మేడ్చల్ : గంగమ్మ కరుణించింది. పాతాళం వదిలి నెమ్మదిగా పైపైకి కదిలివచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాల నీటి మట్టం పెరిగింది. గతేడాదిలో పోల్చితే మేడ్చల్ జిల్లాలో సగటున 2.56 మీటర్లు పైకి వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు గత నెలంతా ముసుర్లు పట్టడంతో వాన నీరు క్రమంగా భూమిలోకి ఇంకింది. జిల్లాలో చెరువులు, కుంటలు నిండిపోయాయి. జలాశయాలకు కళ వచ్చింది. దీంతో అన్నదాత మోములో ఆనందం తొణికిసలాడుతోంది. బోర్లు, బావులలో నీరు సమృద్ధి గా ఉండడంతో పంటలకు ఢోకా లేదని రైతులు సంబర పడుతున్నారు.
పెరిగిన నీటి మట్టం
మేడ్చల్ జిల్లాలో ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దీంతో పాతాళ గంగ ఉబికి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా గత నెలలో సగటున 7.71 మీటర్ల చొప్పున భూగర్భ జల మట్టం నమోదైంది. గతేడాది ఆగస్టులో 10.27 మీటర్ల వర్షపాతం నమోదవ్వగా 2.56 మీటర్ల నీటి మట్టం పెరిగింది. 2021, జూలై లో 7.42 మీటర్ల వర్షపాతం నమోదై, గతేడాదితో పోల్చితే 0.29 శాతం తగ్గింది. ఇప్పుడు 2.56 మీటర్ల వరకు పెరగడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రధానంగా రోజుల తరబడి ముసురు పెట్టడంతో వర్షం నీరు క్రమంగా భూమిలోకి ఇంకి పోయింది. దీంతో భూగర్భ నీటి మట్టం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
వర్షపు బోట్టును ఒడిసి పట్టాలి- రేవతి జిల్లా భూగర్భ జల శాఖ అధికారి
వర్షపు నీటి ప్రతి బోట్టును ఒడిసి పట్టుకోవాలని జిల్లా భూర్భ జలశాఖ అధికారి రేవతి అన్నారు. జిల్లాలో సమృద్దిగా వర్షాలు కురిసినట్లు వెల్లడించారు. దీంతో భూ గర్భ జలాలు గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు తమ విధిగా ఇండ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంటిలోని వర్షపు నీరును వృధా చేయద్దన్నారు. ఇలా చేస్తే నీటి ఎద్దడిని నివారించవచ్చునని తెలిపారు.