- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్చి చివరి నాటికి 9.7 శాతంగా స్థూల మొండి బకాయిలు
దిశ, వెబ్‌డెస్క్: రుణాలపై మారటోరియంతో పాటు కరోనా మహమ్మారి నేపథ్యంలో తీసుకున్న వివిధ చర్యల ప్రభావం తగ్గిపోతున్నందున 2021, మార్చి 31 నాటికి బ్యాంకుల స్థూల మొండి బకాయిలు(జీఎన్‌పీఏ) 9.6-9.7 శాతానికి పెరిగే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక తెలిపింది. అలాగే, 2022, మార్చి 31 నాటికి జీఎన్‌పీఏలు మరింత పెరిగి 9.9-10.2 శాతానికి చేరుకోవచ్చని పేర్కొంది. 2020, డిసెంబర్ చివరి నాటికి బ్యాంకుల జీఎన్‌పీఏ 8.3 శాతం, ఎన్ఎన్‌పీఏ 2.7 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే.
రుణాలపై మారటోరియం, అత్యవసర క్రెడిట్ లైన్ కింద రుణగ్రహీతలకు ఇచ్చిన ఉపశమన చర్యల ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో బ్యాంకులపై ఆస్తి నాణ్యతకు సంబంధించిన ఒత్తిళ్లు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని ఇక్రా అభిప్రాయపడింది. ‘మారటోరియం తర్వాత రుణాల స్థాయి పెరిగింది. దీంతో బ్యాంకుల ఆస్తి నాణ్యత 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల వరకు విస్తరిస్తుందని’ ఇక్రా ఫైనాన్షియల్ సెక్టార్ హెడ్ అనిల్ గుప్తా చెప్పారు. ఎందుకంటే, వివిధ సహాయక చర్యలు లాభదాయకత, బ్యాంకుల మూలధనం దెబ్బతినకుండా నిరోధిస్తాయని అనిల్ గుప్తా వెల్లడించారు. అలాగే, మార్చి 31 నాటికి నికర ఎన్‌పీఏలు 3 శాతం నుంచి 3.1 శాతానికి స్వల్పంగా పెరుగుతాయని ఇక్రా అంచనా వేసింది.