- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రియల్ హీరో.. కొవిడ్‌పై అవగాహనకు పెళ్లి కొడుకు సైకిల్ సవారీ
దిశ, ఫీచర్స్: దేశవ్యాప్తంగా కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూతో పాటు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొవిడ్‌పై అవగాహన కల్పించేందుకు ఓ పెళ్లి కొడుకు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ వరుడు ఏం చేశాడంటే?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గర్ జిల్లా, బోజి గ్రామానికి చెందిన వినయ్ కుమార్ ప్రైవేట్ ఫ్యాక్టరీలో వర్కర్. ఎన్విరాన్‌మెంటల్ యాక్టివిస్ట్ అయిన వినయ్‌కు ఇటీవలే పెళ్లి కుదిరింది. వధువు గ్రామం రాజ్‌గర్.. తన ఊరి నుంచి పది కిలోమీటర్లు. దేశవ్యాప్తంగా కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కొద్దిమంది బంధువులకు మాత్రమే ఆహ్వానం పంపిన వినయ్.. తను కూడా పెళ్లిమంటపానికి స్నేహితులతో కలిసి సైకిల్ పైనే వెళ్లాడు. సాధారణంగా పెళ్లి కొడుకు ఎవరైనా స్నేహితులు, బంధుగణ సమేతంగా కార్లలో వెళ్లి, స్టేటస్ చూపెట్టుకోవాలని అనుకుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితుల రిత్యా ఎటువంటి ఆడంబరాలకు పోకుండా ఇలా సింపుల్‌గా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచాడు వినయ్. దీంతో స్థానికులు వినయ్‌ను రియల్ హీరో అని ప్రశంసిస్తున్నారు. ఇక పెళ్లికి అతి తక్కువ మందితో సైకిల్‌పై మాస్కు ధరించి వచ్చిన వరుడిని చూసి వధువు కుటుంబీకులు, బంధువులు కూడా మెచ్చుకున్నారు.
కొవిడ్ కట్టడికి భౌతిక దూరం, మాస్కులు ముఖ్యమని తెలిపేందుకే సైకిల్‌పైనే పెళ్లికి వచ్చినట్లు వరుడు వినయ్ కుమార్ పేర్కొన్నాడు. ఈ మేరకు పర్యావరణ సేన జిల్లా అధ్యక్షుడు అజయ్ క్రాంతికారి కూడా వినయ్‌ను అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు తాము ఎప్పటి నుంచో ‘గ్రీన్ వెడ్డింగ్’ కాన్సెప్ట్‌ను ప్రమోట్ చేస్తున్నామని, ఇప్పుడు ఆ కాన్సెప్ట్‌తో పాటు కొవిడ్ నార్మ్స్ కూడా ఇంపార్టెంట్ అని సూచించాడు.