- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వియ్యాలవారి అలక.. వివాహాన్ని రద్దు చేసుకున్న పెళ్లికొడుకు
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ సమాజంలో పెళ్లికి ఉండే ప్రాముఖ్యతే వేరు. అందుకే పెళ్లంటే పందిళ్లు.. పందిళ్ల లోగిల్లు.. తాలాలు తలంబ్రాలు..! అంటూ ఆ హడావిడినంతా పాటలో విరచించారు మన కవులు. ముఖ్యంగా పెళ్లిలో వియ్యాలవారికి ఏదైనా లోటు చేస్తే వారి అలకల కారణంగా క్యాన్సిల్ అయిన పెళ్లిల్లు కోకొల్లలు. అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది మహారాష్ట్రలో.. పెళ్లికూతురు వాళ్లు తమకు మర్యాదలు సరిగా చేయలేదని పెళ్లిని రద్దు చేసుకున్నాడు ఒక వరుడు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన కూతురు పెళ్లిని చేయాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్టుగానే భీవండికి చెందిన వరుడితో పెళ్లికి ముహుర్తం కుదిరింది. పెళ్లి కంటే ముందు జరిగే ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాన్ని ఇటీవలే వధువు ఇంట్లో నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది. అయితే వివాహ తేదీ అదే రోజు పెట్టుకోవాల్సి ఉండగా పలు కారణాల రీత్యా అది వీలు పడలేదు. మంచిరోజు చూసుకుని ముహుర్తం పెట్టుకుందామని ఇరు కుటుంబాలు అనుకున్నాయి. తాము ఇంటికెళ్లాక దాని గురించి కబురు చేస్తామని పెళ్లి కొడుకు తరఫున బంధువులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి : 30 రోజులు.. 60 మంది.. ఝార్ఖండ్‌లో యువతిపై గ్యాంగ్‌రేప్
వారం రోజులైనా పెళ్లి కొడుకు తరఫున వారి నుంచి పిలుపు రాకపోవడంతో ఆశ్చర్యానికి గురైన వధువు తండ్రి ఏమైందా అని వారిని ఆరా తీశాడు. వాళ్ల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇలా కాదని సరాసరి వాళ్లింటికే వెళ్లి విషయం ఆరా తీశాడు. అప్పుడు తెలిసింది అసలు సంగతి. ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌లో తమకు మర్యాదలు తక్కువయ్యయనీ, తాము ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశామనీ, కానీ పెళ్లి కూతురు వాళ్లు చాలా తక్కువలో ఆ కార్యక్రమాన్ని అవగొట్టారని వరుడు వాపోయాడు.
దానికి వధువు తండ్రి స్పందిస్తూ.. జరిగిందేదో జరిగిపోయిందనీ, పెళ్లిలో మాత్రం ఏ లోటు లేకుండా చూసుకుంటామని వారిని బతిమిలాడాడు. దీనికి ఆ వరుడు ససేమిరా ఒప్పుకోలేదు. తనకు ఈ పెళ్లి వద్దంటే వద్దని మొండికేశాడు. దీంతో వధువు తండ్రి నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.