కరోనాపై పోరుకు 17 ఏళ్ల ఉద్యమకారిణి లక్ష డాలర్ల విరాళం

by vinod kumar |
కరోనాపై పోరుకు 17 ఏళ్ల ఉద్యమకారిణి లక్ష డాలర్ల విరాళం
X

న్యూయార్క్ : స్వీడన్‌కు చెందిన పర్యవరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ తనకు డానిష్ ఫౌండేషన్ నుంచి బహుమతిగా అందిన 1 లక్ష డాలర్లు (రూ.75,15,184) కరోనాపై పోరుకు విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని యునిసెఫ్ బాలల నిధికి బదిలీ చేస్తున్నానని, కరోనా బారిన పడిన పిల్లల కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. 17 ఏళ్ల వయసులోనే పర్యావరణ ఉద్యమకారిణిగా పేరు తెచ్చుకున్న థన్‌బర్గ్ పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. బాలల హక్కులపై పోరాటం.. కరోనాపై పోరాటం దాదాపు ఒకటేనని ఆమె అభిప్రాయపడ్డారు. కరోనాకు ప్రభావితమయ్యే వారిలో ఎక్కువగా పిల్లలు, వృద్దులే ఉంటున్నారని ఆమె చెప్పారు. యూనిసెఫ్‌కు సాయం చేయడానికి తాను చేస్తున్న ఈ కార్యక్రమానిలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఆమె కోరారు. మార్చి తొలి వారంలో యూరోప్‌లో పర్యటించి వచ్చిన తర్వాత తాను కూడా కరోనా లక్షణాలతో బాధపడ్డానని గ్రెటా వెల్లడించారు. యునిసెఫ్‌కు వస్తున్న నిధులను బాలల కోసం కేటాయిస్తున్నామని సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఆహార కొరత, ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేని ప్రదేశాలు, చదువుకు దూరమైన వాళ్లు, హింసకు గురవుతున్న పిల్లల కోసం ఈ నిధులు వెచ్చిస్తున్నామని యునిసెఫ్ తెలిపింది.

Tags : Grets Thunberg, UNICEF, Coronavirus, Donation, Danish Foundation

Advertisement

Next Story

Most Viewed