- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ విజన్ ఉన్న గొప్ప నేత: సజ్జల
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విజన్ ఉన్న గొప్ప నేత అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద వేడుకలు నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమం అనేది వైఎస్సార్ కుటుంబానికే సాధ్యమని అన్నారు. ఏపీ చరిత్ర గతిని మార్చి నేటికి ఏడాదయిందని అన్నారు. పాలన ప్రారంభించిన ఏడాదికే జగన్ రాష్ట్ర స్వరూపాన్ని మార్చేశారని తెలిపారు.
వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 90 శాతం హామీలను జగన్ అమలు చేశారని ఆయన కితాబిచ్చారు. ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మర్చిపోయారని అన్నారు. రెండు రోజుల పాటు టీడీపీ నిర్వహించిన మహానాడు పార్టీని పటిష్ఠం చేసేందుకా? లేక జగన్‌పై విమర్శలు చేసేందుకా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ ఒక్కసారి మాట ఇస్తే దాన్ని అమలు చేసి చూపిస్తారని ఆయన అన్నారు. రైతుల సంక్షేమానికి జగన్ పెద్దపీట వేశారని, రానున్న రోజుల్లో ఏపీ ప్రజలకు సుపరిపాలన అందుతుందని ఆయన వ్యాఖ్యానించారు.