‘ప్రత్యేక యూనివర్సిటీ కోసం కృషి చేయండి’

by Shyam |   ( Updated:2020-06-20 11:39:51.0  )
‘ప్రత్యేక యూనివర్సిటీ కోసం కృషి చేయండి’
X

దిశ, హైదరాబాద్: రాష్ట్రంలో గురుకుల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సోషల్ వెల్ఫేర్ యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జాన్ కుమార్, కార్యదర్శి నెమలి రవికుమార్‎లు డిమాండ్ చేశారు. గురుకుల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‎కు ఐజీ నుంచి అడిషనల్ డీజీగా పదోన్నతి లభించినందుకు శనివారం ఆయనను పూలబొకేతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గురుకుల కార్యదర్శి ప్రవీణ్ కుమార్‎కు పదోన్నతి పొందినా కూడా ప్రభుత్వం తిరిగి గురుకుల కార్యదర్శిగానే నియామకం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గురుకులాలలో బాలికలకు మాత్రమే డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, బాలురకు కూడా డిగ్రీ కాలేజీ‌లు నెలకొల్పాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాలని ప్రవీణ్ కుమార్‎ను కోరారు.

Advertisement

Next Story