- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఇవ్వనున్న కేంద్రం!
రెవిన్యూ లోటు కారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం కింద మరో రూ. 35,000 కోట్లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దేశ ఏకీకృత నిధి నుంచి అక్టోబర్, నవంబర్ నెలలకు చెందిన పరిహారాన్ని రెండు వాయిదాలలో సెస్ ఫండ్‌కు బదిలీ చేయనున్నట్టు సమాచారం.
దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాల ఆదాయంలో కొరత ఏర్పడితే పరిహారం కింద కేంద్రం ఇస్తుందని గతంలో నిర్ణయించబడింది. బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ..జీఎస్టీ కాంపన్సేషన్ ఫండ్ బ్యాలెన్స్‌ను రెండు వాయిదాలలో బదిలీ చేసేందుకు ప్రభుత్వ నిర్ణయించినట్లు ప్రకటించారు. అక్టోబర్ 2019 నుంచి జనవరి 2020 కాలానికి రాష్ట్రాల జీఎస్టీ పరిహారం రూ. 60,000 నుంచి రూ. 70,000 కోట్లుగా నిర్ణయించబడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2019 ఫిబ్రవరి-సెప్టెంబర్ కాలానికి కేంద్రం ఇప్పటికే రూ. 1 లక్ష కోట్ల రూపాయల పరిహారాన్ని విడుదల చేసింది. 2019-డిసెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం రెవిన్యూ లోటును భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు రూ. 35,298 కోట్లు విడుదల చేసింది.
గత వారం బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, జీఎస్టీ పరిహారం 2019 సెప్టెంబర్ వరకు విడుదల చేయబడిందని, 2019 అక్టోబర్-నవంబర్ నెలలకు పరిహారం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. జీఎస్టీ అమలు తర్వాత ఢిల్లీ, పుదుచ్చేరి, మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాలు సహా ఇప్పటి వరకూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం మొత్తం రూ. 2,10,969.49 కోట్లు విదుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ఇప్పటివరకూ కేంద్రం రాష్ట్రాలకు పరిహారం చెల్లించినవి :
2017 జులై – 2018 మార్చి : రూ. 48,785.14 కోట్లు
2018 ఏప్రిల్ – 2019 మార్చి : రూ. 81,141,14 కోట్లు
2019 ఏప్రిల్-మే : రూ. 17,789 కోట్లు
2019 జూన్-జులై : రూ. 27,956 కోట్లు
2019 ఆగష్టు-సెప్టెంబర్ : రూ. 35,298 కోట్లు.